
– ముదురుతున్న ఎండలు.. జాగ్రత్తలతోనే ఉపశమనం
నవతెలంగాణ – తాడ్వాయి
భానుడి వేడి భగ భగలు నిప్పులు కక్కుతున్నాయి. భగభగ మండే ఎండలతో జనాలు బేజారవుతున్నారు. వెళ్తే ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుండి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎండలు తిరగాలంటే ఏజెన్సీ ప్రజలు భయంతో చెక్కుతున్నారు. ఉదయం 9 గంటలు అయితే చాలు ఉక్క పోత, చెమటలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లని పదార్థాలు సేవిస్తున్నారు. మధ్యాహ్నం 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మేడారం జంపన్న వాగు, కొన్ని చిన్న చిన్న చెరువులు, కుంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ములుగు ఏజెన్సీలోని రైతులు, కార్మికులు, దినసరి కూలీలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.