
– తెలంగాణ ఆర్ఎంపీ,పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్
నవతెలంగాణ – భూపాలపల్లి
నవతెలంగాణ – భూపాలపల్లి
గ్రామీణ వైద్యుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిస్కారం చేయాలని తెలంగాణ ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తి సంపత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు గ్రామీణ వైద్యులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడారు. గ్రామీణ వైద్యుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిస్కారం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ వైద్యులను ప్రభుత్వ వాలంటరీస్ గుర్తించాలన్నారు. గతంలో నిలిసిపోయిన పారా మెడికల్ శిక్షణ తరగతులు పున:ప్రారంభించి సర్టిఫికేట్లు అందజేయాలని, హెల్త్ కార్డులు, రూ.25 లక్షల ఇన్స్ రెన్స్, పిఏప్, ఈవైఏప్ తదితర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐఎంఏ జూనియర్ వైద్యులు గ్రామీణ వైద్యులపై విషం చిమ్ముతున్న విషయాన్ని విరమించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గువ్వలబాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్ల రాజు, అధికార ప్రతినిది చేవూరి రాజేందర్, కోశాధికారి రమేష్, ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, చైర్మన్ లక్ష్మీ నారాయణ, జిల్లా అడ్వైజర్ చారి,ఉపాధ్యక్షుడు కుమార్, రఘు, కిషన్, మోహన్ రెడ్డి ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.