కాంగ్రెసు బీఆర్ఎస్, బీజేపీ లను ఓడించండి

– సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ గెలిపించండి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
కాంగ్రెసు బీఆర్ఎస్ బీజేపీలను  ఓడించి, సీపీఐ(ఎం) ను గెలిపించాలి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు అన్నారు. యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెం ఆదివారం, భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపుతూ దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీస్తు, భారత రాజ్యాగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎం డి జాంగిర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యుడు మంగ నరసింహులు కోరారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్ శక్తులకు అప్పచెప్పుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవినీతిని చట్టబద్ధత చేసిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే ప్రజల సమస్యలు తెలిసిన ప్రజా ఉద్యమ నాయకుడు ఎండి జాంగిర్ ను గెలిపించాలని కోరారు. బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం పై సమగ్ర అవగాహనతో ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి, నాయకులు నల్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.