‘క్రోధి’ కోపించాలి!

అవినీతిపరుల్ని చీల్చి చెండాడడానికి..
అశ్లీల మగాళ్ళను అంతం చేయడానికి..
దురాలోచనల్ని కట్టడి చేయడానికి
అనైతిక పోకడల్ని అడ్డుకోవడానికి..
ప్రకతి విధ్యంస రెక్కల్ని నరికేయడానికి..
లంచగొండుల లాగులూడదీయడానికి..
అబద్దాలకోరుల విషం కక్కించడానికి..
కాలుష్యకారుల కాళ్లను కట్టేయడానికి..
కల్తీరాయుళ్లకు బేడీలు వేయడానికి..
వెన్నుపోటుదారుల్ని వేటాడడానికి..
ఈర్ష్యాధ్వేషాల్ని ఈడ్చిపారేయడానికి..
రక్తం పీల్చే జలగల్ని రఫ్పాడించడానికి..
దుష్టశక్తుల్ని తన్ని తరిమేయడానికి..
రాజకీయ రాక్షసుల్ని రచ్చకీడ్చడానికి..
డబ్బున్న బిచ్చగాళ్ల పీచమణచడానికి..
పన్ను ఎగవేతదారుల పంతం పట్టడానికి..
సైబర్‌ మోసగాళ్లపై కత్తి దూసేయడానికి..
చొరబాటుదారుల తల నరకేయడానికి..
చావు తెలివిగాండ్ల చాపచుట్టేయడానికి..
బొక్కసాన్ని బుక్కే ఎలుకల్ని ఏరేయడానికి..
‘క్రోధి’ వత్సరం క్రోధంతో ఊగి తూగుతూ..
విశ్వ శాంతి, విజ్ఞాన దీపాల్ని వెలిగించాలె !
– మధుపాళీ, 9949700037