– అచ్చంపేట యువజన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బొడ్డుపల్లి చరణ్ విశ్వకర్మ
నవతెలంగాణ:అచ్చంపేట
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని 2024 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అని అచ్చంపేట యువజన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నారు. తుక్కు గూడ కాంగ్రెస్ పార్టీ జన జాతర సమావేశం విజయవంతం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.రాష్ట్రం లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి గా పతనమైనదని బిజెపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పోటీ ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తున్నాడని ఆయన పాలనలో అధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ప్రధానమంత్రి గా రాహుల్ గాంధీ అవుతారని చరణ్ విశ్వకర్మ అన్నారు