వాస్తవ సంఘటనలతో తంగలాన్‌

వాస్తవ సంఘటనలతో తంగలాన్‌విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ”తంగలాన్‌”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్‌ రూపొందిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను పా రంజిత్‌ నీలమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ పార్వతీ తిరువోతు బర్త్‌ డే సందర్భంగా ఇందులో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్‌ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. మహిళా రైతు క్యారెక్టర్‌లో ఆమె నటిస్తున్నట్లు ఫస్ట్‌ లుక్‌ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విక్రమ్‌ను ఓ కొత్త నేపథ్యంలో, విభిన్నమైన క్యారెక్టర్‌లో దర్శకుడు పా.రంజిత్‌ చూపించబోతున్నారు.
‘వాస్తవ సంఘటనల ఆధారంగా కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్‌ అత్యంత సహజంగా తెరకెక్కిస్తున్నారు. కథానుగుణంగా ఇందులోని పాత్ర కోసం విక్రమ్‌ సైతం అందర్నీ ఆశ్చర్యపరిచేలా మేకోవర్‌ అయ్యారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. చియాన్‌ విక్రమ్‌, మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికష్ణన్‌, అన్భు దురై తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – జీవీ ప్రకాష్‌ కుమార్‌, ఆర్ట్‌ – ఎస్‌ ఎస్‌ మూర్తి, ఎడిటింగ్‌ – ఆర్కే సెల్వ, స్టంట్స్‌ – స్టన్నర్‌ సామ్‌, నిర్మాత – కేఈ జ్ఞానవేల్‌ రాజా, దర్శకత్వం – పా రంజిత్‌.