
గాంధారి మండలంలోని చద్మల్ మైనింగ్ వెంటనే ఆపాలి గత పది సంవత్సరాల కన్నా ముందు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మైనింగ్ అడ్డుకోవడం కోసం అనేక పోరాటం జరిగినాయి. దానివల్ల పర్యావరణాలు దెబ్బతింటాయని ప్రజలకు రోగాలు వస్తాయని పశువులకు అనేక సమస్యలు వస్తాయని ఎర్ర జెండా పార్టీ లు ఆరోజు చెప్పిన ఆరోజు ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు విషవాయువుల ప్రారంభమై అన్ని గ్రామాలలో విషాద జ్వరాలు కాళ్లు గుంజడం మనిషి లేవకుండా కీళ్ల నొప్పులు రావడం రెండు నెలల నుంచి ప్రారంభమై కుటుంబంలో ప్రతి మనిషికి విషవాయువుల ప్రారంభమై ఆస్పత్రులు పాలవుతున్న లక్షల రూపాయలు ఖర్చవుతున్న పాలకులకు మాత్రం ఏమీ పట్టనట్టు కనబడుతోంది. స్థానిక ఎమ్మెల్యే నెలరోజులు మైనింగ్ ను బందు చేయించి మళ్లీ ప్రారంభించడానికి కారణం ఏంటో తెలియని మళ్లీ ఎందుకు ప్రారంభించారో సమాధానం ప్రజలకు చెప్పాలని అన్నారు. పాలకుల లాభాల కోసం ప్రజలకు ఏమైనా ఏది ఏమైనా పట్టవని అన్నారు ఎమ్మెల్యే గారు స్పందించి మైనింగ్ ను ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చర్మల్ బీర్మల్ సోమారం దుర్గం గుజ్జుల్ నేరల్ నాగులూర్ గ్రామాలలో అందరూ మంచాన పడ్డారని వీరికి విలువైన వైద్యం అందించాలని అన్నారు. లేనిపక్షంలో ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ ప్రజా పంట జిల్లా నాయకులు దేవ్ సింగ్ నాయక్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్ బంజారా సేవా సంఘం జిల్లా నాయకులు పోమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.