అదే ఫైరూ.. అదే జోరూ

అదే ఫైరూ.. అదే జోరూప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప:2 ది రూల్‌’. ‘పుష్ప ది రైజ్‌’తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ నటనకు, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ‘పుష్ప-2 ది రూల్‌’పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌ అందరికీ పూనకాలు తెప్పిస్తోంది. ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్‌ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో కనిపించని విధంగా ఊర మాస్‌ అవతార్‌లో కనిపించి.. సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు. గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్‌ కట్‌ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ ఇందులో చీరకట్టి.. కాలు వెనక్కి మడిచి పైట కొంగుని అందుకున్న తీరు చూస్తుంటే.. ‘పుష్ప2: ద రూల్‌’ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుందనే హింట్‌ని ఇచ్చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌ లుక్‌, యాటిట్యూడ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. ప్రపంచ సినీ ప్రేక్షకులంతా మరోసారి పుష్పరాజ్‌ గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ పార్ట్‌ 2లో అల్లు అర్జున్‌ విశ్వరూపం చూడబోతున్నారనేది ఈ టీజర్‌తో మరోసారి సుస్పష్టమైంది.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న, ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజరు, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్‌, నిర్మాతలు: నవీన్‌ ఏర్నేని, వై రవిశంకర్‌, సినిమాటోగ్రాఫర్‌: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రామకష్ణ – మోనిక నిగొత్రే, లిరిసిస్ట్‌: చంద్రబోస్‌, సీఈఓ: చెర్రీ, బ్యానర్స్‌: మైత్రి మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌.