అల్లా అందరిని చల్లగా చూడాలి

మత సామరస్యానికి ప్రతీక రంజాన్
నవతెలంగాణ -మల్హర్ రావు
ఆ అల్లా అందరిని చల్లగా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆకాంక్షించారు.ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ ఇఫ్తార్ విందులో భాగంగా సోమవారం జమా మసిద్లో ఇస్తార్ విందుకు హాజరై ముందస్తుగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉపవాసాలు చేపట్టిన ముస్లింలతో దీక్షలు విరమింపజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేసుకుంటున్నారని, రంజాన్ పండుగను ముస్లింలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.