ఈ ఏడాది వర్షాకాలం తక్కువే

– ఖరీఫ్ సాగుకు బాగున్నా.. రబీ సాగుకు కష్టమే..

– నూతన పంచాంగంలో వెల్లడించిన వెంకట్ మహారాజ్

– ఉగాది పంచాంగంలో పాల్గొన్న వ్యవసాయ దారులు
నవతెలంగాణ – మద్నూర్

ఉగాది నూతన పంచాంగంలో ఈ ఏడాది వర్షాకాలం తక్కువగా ఉన్నట్లు ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ రబ్బి పంట సాగుకు కష్టకాలంగా కనిపిస్తుందని నూతన పంచాంగంలో వెంకట్ మహారాజ్ వెల్లడించారు. మద్నూర్ మండల కేంద్రంలోని అత్యధికంగా వ్యవసాయదారులు ఉండే రథం గల్లి లోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో మంగళవారం నాడు ఉగాది రోజున ఉదయం 10 గంటలకు వ్యవసాయదారుల ఆధ్వర్యంలో నూతన పంచాంగాన్ని చదివి వినిపించారు. ఏ ఏ పంటలకు అనుకూలం అనే దానిపై రైతులు పంచాంగం వెల్లడించే మహారాజుకు అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ సాగులో భాగంగా పెసర మినుముకు బాగుందని తెలిపారు. ఇక రబ్బి పంట సాగులో వర్షాకాలం కష్టకాలంగానే కనిపిస్తుందని తెలిపారు. ఈ పంచాంగ కార్యక్రమంలో వ్యవసాయదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.