టైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా సంబడి ప్రవీణ్

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఎన్నికలు హైదరాబాదులో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో  టైక్వాండో అసోసియేషన్ జిల్లాకు చెందిన తైక్వాండో మాస్టర్ సాంబడి ప్రవీణ్ ను జిల్లా ప్రెసిడెంట్  ఎన్నుకున్నారు. జిల్లా టైక్వాండో మాస్టర్  వినోద్ నాయక్ ను జనరల్ సెక్రెటరీగా  ట్రెస్ససర్ గా బాణోత్ వినోద్ ను ఎన్నుకోవడం జరిగింది.  ఎన్నో సంవత్సరాల తరబడి అనేక మంది యువతి యువకులకు,  తైక్వాండోలో శిక్షణ ఇచ్చి నిష్ణాతులను తయారుచేసి తైక్వాండో మాస్టర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా స్వయంగా వీరు, వీరి శిష్యులతో ఎంతోమంది పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాల బాలికలకు సెల్ఫ్ ప్రొటెక్షన్  ఆరోగ్య సూత్రాలను అందిస్తూ ఆరోగ్యభారత నిర్మాణంలో అవిరామంగా సేవలందిస్తున్నారు. వీరి సేవలకు ప్రతిఫలంగా మంచి గుర్తింపు లభించిందని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాల్క కొమరయ్య,రాష్ట్ర జనరల్ సెక్రెటరీ. వహిద్అలీఖాన్.రాష్ట్ర ట్రెస్సరర్ , మారుతికి,  రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.