భారీగా ఎడ్లబండ్ల ప్రదర్శన

నవతెలంగాణ – ఆర్మూర్ 

మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో మంగళవారం ఉగాది పండగ సందర్భంగా గ్రామంలో గల మల్లన్న, వేణుగోపాల స్వామి, రామాలయం తదితర ఆలయాల చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బండమీది జమున గంగాధర్, ఎంపీటీసీ యల్ల రాజ్ కుమార్, సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్, విడిసి అధ్యక్షులు లింగారెడ్డి ,సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.