కోన సముందర్ లో పంచాంగ శ్రవణం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని  కొనసముందర్ గ్రామంలో మంగళవారం క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక  గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు సుధాకర్ శర్మ పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బద్దం గంగారెడ్డి, ఉపాధ్యక్షులు రూపాల ధర్మాజీ, క్యాషియర్ కరిపే శేఖర్, కార్యదర్శి మేకల శేఖర్, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, మాజీ ఉపసర్పంచ్ పెరం లింబాద్రి, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.