హీరో శ్రీవిష్ణు తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి, విజిల్ వర్తీ ఫిల్మ్స్, కెఎఫ్సి ప్రొడక్షన్ నెం.1గా అనూష ద్రోణవల్లి, సీతా కుమారి కొత, గోపాలం లక్ష్మీ దీపక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి, రచయిత కోన వెంకట్ ఈ సమర్పిస్తున్నారు. ఈ కొత్త సినిమా ఉగాది సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది. నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం వేడుకకు సాహు గారపాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార నాగ వంశీ, బివిఎస్ రవి తదితరులు హాజరయ్యారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, ‘ఇది చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అందరికీ కూడా ఆహ్లాద కరమైన సినిమా ఇస్తామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.