– మాజీ సర్పంచ్ బండిమీది కృష్ణమాదిగ
– మొండి గౌరెల్లిలో ముగిసిన ఎంపీఎల్
– సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్
– గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్
నిత్యం క్రీడల్లో పాల్గొనే వారికి మానసిక ఉల్లాసం కలుగుతుందని మాజీ సర్పంచ్ బండిమీది కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లిలో రెండు నెలలుగా జరిగిన ఎంపీఎల్ సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెరుగుతాయని తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన మొదటి బహుమతిని నక్క మధు, ద్వితీయ బహుమతిని గొడుకండ్ల ప్రవీణ్ టీములు అందుకున్నాయి. అనంతరం మాజీ సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు క్రీడాకారులను అభినందించారు. ఈ టోర్నమెంట్‌కు విరాళాలు అందజేసిన దాతలు మేకల బాలకృష్ణ, మాజీ సర్పంచ్, కొలను మల్లారెడ్డి, వీర బొమ్మల శ్రీనివాస్ గుప్తా, ఎలిమినేటి తిరుమల్ రెడ్డి, కట్టెల జగదీష్, నక్క శ్రీనివాస్ యాదవ్, గుర్రం జగదీశ్వర్ రెడ్డి, సురకంటి మహేందర్ రెడ్డి, యాస శివలింగారెడ్డి, కట్టెల ప్రవీణ్, ఆర్గనైజర్ కుంటి ఐలేష్, కట్టెల చంద్రశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.