నవతెలంగాణ-సిటీబ్యూరో
రోజురోజుకు టెక్నాలజీ మారుతున్న నేటి ప్రపంచంలో ఆధునిక కోర్సులపై యువత మొగ్గు చూపుతున్నందున ఫుల్ స్టాక్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఫైవ్ జి.టెక్నాలజీ, బ్లాక్ చైన్ టక్నాలజీ, ఆర్టిఫిషల్ టెక్నాలజీ తదితర అత్యాధునిక కోర్సులకు సంబంధించి ఆయా కోర్సులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ ల ద్వారా ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చి వారి ఉజ్వల భవితకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌తో గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా (ఈఎస్‌సీఐ) సోమవారం భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఎస్కీ బోర్డు రూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ వావుతో పాటుగా, కార్యాలయ చీఫ్ లక్ష్మికాంత రావు, పలు డివిజన్ లకు చెందిన హెడ్స్ ఆఫ్ డిపార్ట్ మెంట్స్, యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అసోసియేట్ వైస్ చాన్సలర్ చంద్ర ఎస్.దసక తో పాటుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ మావూడూరి, ఆర్.డి.వి ప్రసాద్ లు పాల్గొన్నారు.. ఈ కోర్సులను స్టడీ చేసిన యువత మేకిన్ ఇండియాలో భాగంగా ఇక్కడే అద్భుతమైన ప్రతిభను చూపెట్టి అవకాశం ఉంటుందని, ఇలాంటి కోర్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచనకు యూనివర్సిటీ ఆఫ్ ఎమెర్జింగ్ టెక్నాలజీ ప్రతినిధులు సహకరిస్తున్నందుకు వారికి ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీ అఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు.