కూల్‌ డ్రింక్స్‌ వద్దు సహజ పానీయాలే ముద్దు

నవతెలంగాణ-దుండిగల్‌
నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రగతి నగర్‌ లోని సుందరయ్య భవన్‌లో మంగళవారం ఉగాది పండగ పురస్కరించుకొని జనవిజ్ఞాన వేదిక, లైఫ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కూల్‌ డ్రింక్స్‌ వద్దు సహజపా నియాలే ముద్దు అనే స్లోగన్‌ తో ఈ కార్యక్రమం జరిగింది. అనేకమంది ప్రగతినగర్‌ వాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు శంకర్‌ రావు, మల్లయ్య చారి, కష్ణయ్య, అనంత కుమార్‌ , మల్లేష్‌, లైఫ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె ప్రశాంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.