సరికొత్త బ్రావియా ఎక్స్ఆర్ ఎ80ఎల్  ఓఎల్ఈడి సిరీస్ విడుదల

నవతెలంగాణ-హిమాయత్ నగర్ 
ఇటీవల తమ నూతన బ్రావియా ఎక్స్ఆర్ ఎ80ఎల్ ఓఎల్ఈడి సిరీస్ విడుదల చేసినట్లు సోనీ ఇండియా సంస్థ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.దీనిలో కాగ్నిటివ్‌ ప్రాసెసర్‌ ఎక్స్ఆర్ ఉందని, ఓఎల్‌ఈడి టీవీ సిరీస్‌ వీక్షణ, శబ్ద అనుభవాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని పేర్కొంది.ఇది మానవ మెదడులా ఆలోచించడంతో పాటుగా పూర్తి లీనమయ్యే అనుభవాలను, మన చుట్టూ ఉన్న ప్రపంచం కదులుతున్న అనుభూతులను ఇది అందిస్తుంది.తమ శ్రేణిలో అత్యుత్తమంగా ఉండటంతో పాటుగా ఆల్ట్రా రియలిస్టిక్‌ చిత్ర నాణ్యత, జీవితపు తరహా కాంట్రాస్ట్‌తో పాటుగా నూతన కాగ్నిటివ్‌ ప్రాసెసర్‌ ఎక్స్‌ఆర్‌ అసాధారణ శబ్దాన్ని వాస్తవిక చిత్రం నుంచి వచ్చే శబ్దంతో అందిస్తుంది.భావి తరపు కాగ్నిటివ్‌ ప్రాసెసర్‌ ఎక్స్ఆర్ వినోదం కోసం తయారు చేయబడింది.తమ అభిమాన కంటెంట్‌లో వీక్షకులు పూర్తిగా లీనమయ్యేలా ఇది విప్లవాత్మక అనుభవాలను అందిస్తుంది.ఎక్స్ఆర్ ఓఎల్ఈడి కాంట్రస్ట్ ప్రోతో ప్యూర్‌ బ్లాక్స్‌, పీక్‌ బ్రైట్‌నెస్‌తో మరింత డెప్త్‌, టెక్చర్‌ను ఆస్వాదించవచ్చని ఆ సంస్థ తెలిపింది.తాజా ఎక్స్ఆర్ 4కె అప్‌స్కేలింగ్‌, ఎక్స్ఆర్ క్లియర్‌ ఇమేజ్‌, ఎక్స్ఆర్ ఓఎల్ఈడి మోషన్‌ టెక్నాలజీతో 4కె యాక్షన్‌ను ఆస్వాదించవచ్చునని, ఇది మృదువుగా, ప్రకాశవంతంగా ఎలాంటి బ్లర్‌ లేకుండా స్పష్టంగా ఉంటుందని తెలిపింది.