బాధితునికి పోయిన ఫోన్ వెతికి అందించిన పోలీసులు

నవతెలంగాణ – వీర్నపల్లి
అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా పోయినటువంటి ఫోన్ ఏఎస్ఐ రాజిరెడ్డి అందించారు. వీర్నపల్లి మండలం దొంగతననికి లేదా పోయిన మొబైల్ ని తిరిగి పొందడానికి సీఈఐఆర్ అప్లికేషన్ ఎంతో దోహదపడుతుందని వీర్నపల్లి ఎస్ఐ రమేష్ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా పోయినటువంటి ఫోన్ బాధితునికి అప్పగించడంతో పాటు సెంట్రల్ ఏక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే అప్లికేషన్ ద్వారా ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి ఫోన్ లను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని వివరించారు. మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ – హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్ తో చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. రంగంపేట కి చెందిన బొజ్జ కనకరాజు మొబైల్ ఫోన్ వన్ ప్లస్ రంగంపేట లోని బుగ్గ రామస్వామి ఆలయం వద్ద ఏప్రిల్ 3 న ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా, CEIR (సిఈఐఆర్) అప్లికేషన్ ద్వారా నూతన టెక్నాలజీని ఉపయోగించి ఆ మొబైల్ ని గుర్తించి, పోలీసులు స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తికి అందించారు. ఫోన్ వెతికి అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కార్తిక్, పోలిస్ సిబ్బంది ఉన్నారు.