
జాతీయ స్థాయిలో జరిగిన ఒలింపియాడ్ ఎగ్జామ్ ( ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్) ఎగ్జామ్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ పరీక్ష లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి ( లేనివో టాబ్)ని 7వ తరగతి చదువుతున్న వై. సమీక్ష,మూడవ బహుమతి( స్మార్ట్ వాచ్)ని 5వ తరగతి చదువుతున్న ఎం. మాన్య రెడ్డి, నాల్గవ బహుమతి ( హాండ్ బ్యాగ్) ని, 6వ తరగతి చదువుతున్న జి.భవ్య ,ఐదవ బహుమతి( హాట్ బాక్స్)ని 9వ తరగతి చదువుతున్న పి. హర్షిత్ రెడ్డి గెలుపొందరని ,అలానే వివిధ తరగతులకు చెందిన విధ్యార్ధులు అనేక బహుమతులను గెలుపొందారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి బుధవారం తెలిపారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్మూర్ శ్రీ చైతన్య పాఠశాల నుండి 278 మంది విద్యార్థులు ఈ జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఎగ్జామ్ లో సత్తా చాటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తు, ప్రిమరీ కో ఆర్డినేటర్ ప్రసన్న,ప్రీ ప్రైమరీ కో ఆర్డినేటర్ శ్రీ విద్య, డీన్ సంతోష్, సి ఇంఛార్జి రాకేష్ ,పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.