– నేటినుంచి దరఖాస్తుల సవరణకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ గడువును ఈనెల 20 వరకు పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియగా… అభ్యర్థులు, పలు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించారు. గతేడాది ఆగస్టు ఒకటిన టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అదేనెల 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అభ్యర్థులు, పలు విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు గడువును పొడిగించాలంటూ ధర్నాలు చేసినా, వినతిపత్రాలను సమర్పించినా విద్యాశాఖ అధికారులు స్పందించలేదు. ఈసారి మాత్రం టెట్ దరఖాస్తు గడువును పొడిగించడం గమనార్హం. గురువారం వాటి సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని కన్వీనర్ తెలిపారు. ఈ ప్రక్రియ ఈనెల 20 వరకు కొనసాగుతుందని వివరించారు. టెట్ పేపర్-1కు 85,625 మంది, పేపర్-2కు 1,47,618 మంది కలిపి 2,33,243 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. బుధవారం ఒక్కరోజే పేపర్-1కు 7,929 మంది, పేపర్-2కు 16,966 మంది కలిపి మొత్తం 24,895 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. వచ్చేనెల 20 నుంచి జూన్ మూడో తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://రషష్ట్రశీశీశ్రీవసబ. ్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.