– శ్వేత మల్టీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్.కె.నాగేశ్వరీ
– హిప్నో కమలాకర్ జయంతి వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైకాలజీ రంగానకి మహౌన్నతమైన ఒక శక్తి కమలాకర్ అని శ్వేత మల్టీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్. క.నాగేశ్వరీ రావు అన్నారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం డా.హిప్నో కమలాకర్ జయంతి వేడుకలు ముషిరాబాద్ తెలంగాణ మైనారిటీ ప్రభుత్వ బాలికల స్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, ఇఫ్తార్ విందు భోజనం డా.హిప్నో పద్మా కమలాకర్, జి.హిమకర్, జి.కష్ణ వేణి, స్కూల్ హెచ్ ఎమ్ వాణిశ్రీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేరు అందరికీ ఉంటుంది కానీ కొంతమంది పేరు మాత్రమే చరిత్రలో ఉంటుందని అదే కమలాకర్ అన్నారు. పక్క వాళ్ళు విజయం సాధించాలనే తపన చెందే వ్యక్తి కమలాకర్ అన్నారు. ఏ విషయం గురించి అయినా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి, మూఢనమ్మకాలు నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి కమలాకర్ అన్నారు. అడ్వకేట్ జి.కష్ణవేణి మాట్లాడుతూ కమలాకర్ సైకాలజిస్ట్, సామాజిక వేత్తే కాదు ఒక న్యాయవాది కూడా అన్నారు. కోర్టుకు మరలా నేను వస్తున్నా అన్నంతలోనే ఇలా జరగడం దురదష్టం అన్నారు. సామాజిక సమానత్వం కోసం, చైతన్యం తెచ్చేలా ప్రోగ్రామ్స్ చేసిన ” ఫైటర్”, 100 పుస్తకాలు రాసిన ”రైటర్” అయినా గొప్ప మానవతా వాది అన్నారు. డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ సైకాలజిస్ట్ లకు వత్తి పరమైన భద్రతను ,సైకాలజిస్ట్ లకు కౌన్సిల్ ఏర్పాటుచేసేందుకై వారి పోరాట పటిమ అభినందనీయ మన్నారు. ఇప్పుడు ఉన్నత పాఠశాలలో సైకాలజిస్ట్ లను నియమించాలనే వార్త, వారి నినాదం ఫలించందని వారు జీవించి ఉంటే ఎంతో సంతోషించే వారిని చెప్పారు. సైకాలజిస్ట్ లకు సమాజంలో గుర్తింపు రావడానికి వారి కషి ప్రశంసనీయమన్నారు. వారి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్ళేందులకై ప్రతి సైకాలజిస్ట్ తన వంతు కషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. హిమకర్ మాట్లాడుతూ వికాశవంతమైన వ్యక్తిత్వం, ప్రణాళికబద్దమైన నడవడిక, సాధించి చూపగలనన్న పట్టుదల గల వ్యక్తి మా నాన్న అని అన్నారు.తాను వత్తినే ఇంటి పేరుగా మార్చుకుని దేశవ్యాప్తంగా హిప్నాటిజం ప్రదర్శనలు చేసి మనిషిలో ఉన్న శక్తి, సామర్థ్యాలను నిరూపించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. హిప్నాటిజం, సైకాలజీ మేళవించి అనేక మానసిక సమస్యలు నివారించవచ్చని సమాజానికి చాటి చెప్పిన మహా మేధావి అని అన్నారు. ఈరోజుల్లో సైకాలజీ గురించి అందరికీ అవగాహన వచ్చిందంటే ఆయనే కారణమన్నారు.