ప్రముఖులను సత్కరించడం ఉత్తమ సంస్కారం

– శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-కల్చరల్‌
ఉగాది నాడు సంప్రదాయంగా ప్రముఖులను సత్కరించటం ఉత్తమ సంస్కారం అని రాష్ట్ర శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు రవీంద్ర భారతి ప్రధాన వేదిక పై కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్స్‌ నిర్వహణ లో క్రోధి నామ ఉగాది పురస్కరించుకొని వివిధ రంగాల ప్రముఖుల పేరిట ఏర్పరచిన అవార్డులను భిన్న రంగాల్లో ప్రతిభా వంతులతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులను అందుకోబోయే తెలుగు ప్రముఖులకు సత్కారం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి అవార్డులు బహుకరించి అభినందించారు. సివిల్‌ సర్వీస్‌ విశ్రాంత ఉన్నతాధికారి డాక్టర్‌ కె.వీ.రమణ అధ్యక్షత వహించిన వేదిక పై సౌజన్యం అందించిన భోగరాజు మూర్తి తదితరులు పాల్గొనగా కిన్నెర రఘురాం స్వాగతం పలికారు. అవార్డ్స్‌ గ్రహీతలు: పోలీస్‌ విశ్రాంత ఉన్నత అధికారి జె.వీ.రాముడు, శాంత బయోటెక్‌ డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి, జస్టిస్‌ శేష శయన రెడ్డి, ఇస్రో శాస్త్రవేత్త కమలాకర్‌, రంగస్థల ప్రముఖుడు బి.ఎల్‌.రెడ్డి, నాట్య గురువు డాక్టర్‌ జొన్నలగడ్డ అనురాధ, వాయులీన కళాకారి ణి జయప్రద రామ మూర్తి వైద్యులు రాధా కిరణ్‌,అధ్యాత్మిక వేత్త వీ.సుబ్రహ్మణ్య శాస్త్రి పీ.వీ.ఏస్‌.ఏస్‌ ప్రసాద్‌ వున్నారు. పద్మశ్రీ పురస్మతులు కోరెళ్ళ విఠలాచార్య, హరికథ కళా కారిణి ఉమా మహేశ్వరి, గడ్డం సమ్మయ్య, స్టపతి వెలు ఆనంద చారి, దాసరి కొండప్పలను సత్కరించారు. దక్షిణా మూర్తి వ్యాఖ్యానం చేసిన కార్యక్రమానికి తొలుత ఆర్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ వారిచే డాక్టర్‌ అనురాధ దర్శకత్వం లో మహాకాళి నత్య రూపకం ముగ్ధులను చేసింది.