బీబీసీ ఇండియా కలెక్టివ్‌ న్యూస్‌ రూమ్‌

లండన్‌ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు (ఎఫ్‌డిఐ)కు అనుగుణంగా భారత్‌లో బిబిసి పునర్‌ నిర్మాణం ‘కలెక్టివ్‌ న్యూస్‌ రూమ్‌’ ను బుధవారం ప్రారంభించింది. బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ స్థానంలో ఏర్పాటైన కలెక్టివ్‌ న్యూస్‌ రూమ్‌ భాష ఆధారిత కంటెంట్‌ను అందించనుంది. ”అత్యంత విశ్వసనీయమైన, సృజనాత్మకమైన, సాహసోపేతమైన జర్నలిజాన్ని అందించడానికి అనుభవం, ప్రతిభతో కూడిన మా అద్భుతమైన బృందం స్పష్టమైన లక్ష్యంతో కలెక్టివ్‌ న్యూస్‌ రూమ్‌ను అధికారికంగా ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను” అని కలెక్టివ్‌ న్యూస్‌ రూమ్‌ సిఇఒ రూపా ఝా పేర్కొన్నారు. కలెక్టివ్‌ న్యూస్‌ను వాస్తవాలతో, ప్రజా ప్రయోజనాల కోసం, విభిన్న వ్యక్తుల గొంతుకలను, దృక్కోణాలను అందించే స్వతంత్ర వార్తాసంస్థగా ప్రేక్షకులు త్వరలోనే తెలుసుకుంటారని అన్నారు.