– నివాళులర్పించిన ఎంపీడిఓ మోహన్ రెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
మహాత్మాజ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మండలం వ్యాప్తంగా బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయా లో అధికారులు పాల్గొని పూలేకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు. మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడిఓ వర్కాల మోహన్ రెడ్డి జ్యోతి రావు పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎంపిడీఓ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని ప్రసంసించారు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని చెప్పుకొచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే మార్గంలోనే తాము పయనిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలని అకాంక్షించారు. సమాజంలో కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షులు డాకు నాయక్, విజయ్ కుమార్,రవీందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ముంతాజ్,జూనియర్ అసిస్టెంట్ వెంకట్,సీనియర్ అసిస్టెంట్ మురళి,కంప్యూటర్ ఆపరేటర్ ఎల్లయ్య, గోవర్ధన్, శ్రీను తదితరులు నివాళులు అర్పించిన వారిలో వున్నారు.