మంథని అసెంబ్లీ కో-ఆర్డినేటర్‌గా ఎర్రవెల్లి విలాస్ రావు

నవతెలంగాణ – మల్హర్ రావు
లోకసభ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మంథని అసెంబ్లీ కోఆర్డినేటర్ గా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఎర్రవెల్లి విలాస్ రావు ను నియమించినట్లుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గురువారం తెలిపారు. తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర ఐటి,పరిశ్రమ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్న పార్లమెంట్ పరిదిలో మంథని నుండి అత్యధిక మెజారిటీ తెచ్చేలా అలానే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీ కనుకగా ఇవ్వనున్నట్లుగా విలాస్ రావు  తెలిపారు.