ట్రైకోడెర్మా విరిడె తో తెగుళ్ల నివారణ

నవతెలంగాణ – తాడ్వాయి 
రైతులు తమ పొలాలలో  ట్రైకోడెర్మా విరిడె వాడుకోవాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులు తెలిపారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని రైతుల పొలంలో విద్యార్థులు ట్రైకోడెర్మా విరిడె తో తెగుళ్ల నివారణ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టటానికి ట్రైకోడెర్మావిరిడి జీవ శిలీంధ్రం ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు. తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులోవుంది అని తెలిపారు. దీన్ని పశువుల ఎరువులో కలిపి భూమిలో తేమ వున్నప్పుడు దుక్కిలో వెదజల్లితే భూమి ద్వారా వ్యాప్తిచేందే శిలీంద్రపు తెగుళ్లను నాశనంచేస్తుంది అని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు భాను రాజు,భాను ప్రసాద్,రాకేష్,రమేష్,సుంకరి రమేష్ ,   నవీన్ విద్యార్థులు శిరీష,శ్రావణి, సరితా, సారిక సాయి ప్రియ తదితరులు పాల్గొన్నారు.