సనాతన ధర్మంపై పోరాడడమే పూలేకు నిజమైన నివాళి: పాలడుగు భాస్కర్

నవతెలంగాణ – భువనగిరి
మనుధర్మ శాస్త్రంపై,సనాతన ధర్మం పై చిన్ననాటి నుంచే పోరాడిన విప్లవ యోధుడు మహాత్మా జ్యోతి భాపూలే అని ఆయన ఆశయాలు కొనసాగించడం అంటే సనాతన ధర్మంపై పోరాడడం ద్వారానే నిజమైన నివాళి అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలియజేశారు. గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోనీ సుందరయ్య భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి భాపూలె 197 వ జయంతినీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్ గారు మాట్లాడుతూ.. సనాతన ధర్మం పేరుతో అణగారిన వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రలను వ్యతిరేకించి మహిళలకు విద్య అవసరమని తన భార్య సావిత్రి భాయి ఫూలేకు చదివి నేర్పించి మహిళకు,వితంతు మహిళలల కోసం దేశంలోనే మొదటి సారి 1848 పాఠశాలలను నెలకొల్పి చదువునెర్పిన త్యాగధనులు ,విప్లవ యోధులు మహాత్మా జ్యోతి భాపూలే దంపతులనీ కొనియాడారు. మహాత్మా జ్యోతి భాపూలే దంపతులు జీవితాంతం పోరాడింది మనుధర్మ శాస్త్రంపై, సనాతన ధర్మంపై అని తెలియజేశారు. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడి ప్రభుత్వం ఆ మనుధర్మ శాస్త్రన్ని మళ్ళీ అమలు చేస్తూ జ్యోతి భాపులే ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని  విమర్శించారు. నేడు మోడీ సనాతన ధర్మం పై పోరాటం నిర్వహించడం ద్వారానే జ్యోతి భాపులె కు నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య, వ్యకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ,  జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, పట్టణ కన్వీనర్ గందమల్ల మాతయ్య,నాయకులు సంజీవ పాల్గొన్నారు.