చండూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

– చండూరు కాంగ్రెస్ నేతలు 
నవతెలంగాణ – చండూరు  
స్థానిక  మున్సిపల్ కేంద్రం   లోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో గురువారం  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ దివ్య ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం అని ఈ మాసంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ రంజాన్ పండుగ సమస్త మానవాళికి శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ,క్రమశిక్షణ, దాతృత్వం, ధర్మనిబద్ధత, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ అని ఆయన అన్నారు.  ముస్లిం, హిందూ   సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు  మున్సిపల్ వైస్ చైర్మన్ ధోటి వెంకన్న సుజాత, చుండూరు ఎస్సై  సురేష్  కమ్రు, కరెంటు షరీఫ్ ,సాదక్, నిరంజన్ అలీ, జిన్నా, లతీఫ్, షజ్జు పాష, ముజ్జు, జావేద్, ఎజస్ ,  జిల్లా కాంగ్రెస్ నాయకులు కోడి గిరిబాబు , బూతరాజు వేణు, ఐతరాజు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.