అదుపు చెట్టును ఢీకొట్టిన కారు

– రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
– మరోముగ్గురికి గాయాలు
– ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
అతివేగం, అజాగ్రత్తతో ప్రయాణిస్తున్న కారు చెట్టు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరూ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అక్బరుపెట్ భూంపల్లి మండలంలోని చిట్టాపూర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అక్బరుపేట భూంపల్లి ఎస్ ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం రామయంపేట్ కు చెందిన వారు టీఎస్ 15 ఈఎఫ్ 3590 గల నెంబర్ కారులో బూరుగుపల్లి లోని బంధువుల పెళ్లికి బయలుదేరారు. తిరిగి రామయంపేట్ వస్తుండగా చిట్టాపూర్ గ్రామ శివారు కు రాగానే అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.దీంతో రామయంపేట్ కు చెందిన నర్సింలు భార్య పుష్ప(44)అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతురాలి భర్తకు తల, ఎడమకాలు గాయమైంది. జెల్లా లక్ష్మికి దవడ, ఛాతీ, రెండు కాళ్ల కు తీవ్ర గాయం కాగా… స్థానికులు పోలీసులకు,108 సమాచారం తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.పోస్టుమార్ట్ నిమిత్తందుబ్బాక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.