మహబూబాబాద్ ఎంపీగా నన్ను (కవిత) గెలిపించండి

– పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత
– తాడ్వాయి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెల్లడి
నవతెలంగాణ – తాడ్వాయి
మహబూబాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటిలో నిలిచిన నేను అయిన మాలోత్ కవితను అందరూ ఆదరించి, అధిక మెజార్టీ తో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. గురువారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు దండగల మల్లన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి వచ్చి, ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సారి కూడా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ రథసారధి కేసీఆర్ గుర్తించి నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో ఎంపీగా నన్ను గెలిపిస్తే పార్లమెంటులో తెలంగాణ గళం వినిపిస్తారని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే పార్టీల నాయకులు ఎవరు ఉండరని, బిఆర్ఎస్ నాయకులు పార్లమెంట్లో గల విప్పుతారన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్, బిజెపికి చెందిన ఎంపీలు వారి నాయకత్వం ప్రకారం నడుచుకుంటారని అన్నారు. వారికి వేరే ప్రయోజనాలు ఉంటాయని, కానీ బిఆర్ఎస్ నాయకుడు కేసిఆర్ కు మాత్రం వేరే ప్రయోజనాలు లేవు అని అన్నారు. కేవలం రాష్ట్రం కోసం పోరాడి, తెలంగాణను సాధించారని కవిత తెలిపారు. ఈసారి కూడా ప్రతి గ్రామంలో అధిక మెజార్టీతో బిఆర్ఎస్ కు ఓటు వేసి మెహబూబాబాద్ ఎంపీగా నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, నాయకులు దిడ్డి మోహన్ రావు, రమణయ్య, ఇంద్రారెడ్డి, పుర్రి స్వరూప, గడ్డం అరుణ, సోమ నాగమ్మ, ఊకే మోహన్ రావు, కార్యకర్తలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.