నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామంలో శుక్రవారం కూనింటి శేఖర్ రెడ్డి స్వగృహంలో పార్వతి పరమేశ్వర ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమవరం నుండి విచ్చేసిన తటవత్రి వీర రాఘవరావు మాట్లాడుతూ.. ధ్యానం యొక్క విశిష్టతను వివరించినారు. ఈ కార్యక్రమంలో విక్రమ్,, ఉమ్మడి జిల్లాలకు చెందిన అధ్యక్షులు, వివిధ గ్రామాల ధ్యాన బంధువులు తదితరులు పాల్గొన్నారు.