
నిజామాబాద్ నగర సీపీఐ(ఎం) పార్టీ కమిటీ సభ్యుడు, బహుజన కాలనీ భూ పోరాట నాయకుడు మైనార్టీ ఉద్యమ నాయకుడు మున్నాభాయ్ శుక్రవారం అనారోగ్యానికి గురై తుది శ్వాస వీడియో విడిచారని, ఆయన మరణం సీపీఐ(ఎం) పార్టీ ఉద్యమానికి, కాలనీ అభివృద్ధికి తీవ్ర నష్టం చేస్తుందని ఆయన భౌతిక్యానికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ప్రకటించారు. పేద ప్రజల తరఫున బహుజన కాలనీలో ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహణలో ముఖ్య భూమిక పోషించారని అనేక ప్రజా సమస్యలపై ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన తెలిపారు. మున్నాభాయ్ అంత్యక్రియలలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నగర కార్యదర్శి పి.సూరి జిల్లా కమిటీ సభ్యులు సుజాత , విఘ్నే నగర కమిటీ సభ్యులు కటారి రాములు మహేష్ తదితరులు పాల్గొన్నారు.