నవతెలంగాణ కథనానికి స్పందన

– ఎట్టకేలకు స్పందించిన ఫారెస్ట్ అధికారు
– జంతువులకు సాసర్ ఫీట్లల్లో ట్యాంకర్ లతో నీరు అందజేత
 నవతెలంగాణ – రామారెడ్డి
అడవి జంతువులకు వేసవి కాలంలో దప్పికతో అలుమటిస్తున్నాయని, మూగజీవులకు అడవిలో నీరు లభించకపోవడంతో మృత్యువాత పడుతున్నాయని, పంట పొలాల వైపు, గ్రామాల వైపు దాహం తీర్చుకొనడానికి ముగజీవులు రావడం ప్రజలు బయందోళనకు గురవుతున్నారని, నిధులు లేక నీరు అందించటం లేదని, నవ తెలంగాణలో బుధవారం “నీళ్లకు నిధులు లేవు” అనే శీర్షికను ప్రచురించడంతో ఎట్టకేకలకు అడవి అధికారులు స్పందించి రామారెడ్డి మండలంలోని  రెడ్డిపేట్ సెక్షన్ పరిధిలోని మద్దికుంట, ఇస్సన్నపల్లి, రెడ్డిపేట్ తదితర గ్రామాల పరిధిలోని అడవుల్లో శుక్రవారం ఫారెస్ట్ అధికారులు జంతువులకు నీరు అందించటానికి ఏర్పాటు చేసిన సాసర్ ఫీట్లల్లో ట్యాంకర్లతో నీరు ఏర్పాటు చేశారు. నిధులు మంజూరు కాకపోయిన   క్షేత్రస్థాయి అధికారులు సొంత డబ్బులతో వేచించి మూగజీవులకు నీరు అందిస్తున్నారు. ప్రత్యేక అధికారి భీమ్ రెడ్డి శుక్రవారం రెడ్డి పేట సెక్షన్ పరిధిలోని సాసర్ ఫీట్స్ ను పరిశీలించారు. కార్యక్రమంలో శిక్షణ అధికారి శంకర్, బీట్ అధికారులు శేఖర్ రెడ్డి, రామ లీల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.