సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్ ను గెలిపించండి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల్ని ఓడించి నిరంతరం ప్రజల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని పంతంగి గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశం అంతటి అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆశయ్య మాట్లాడుతూ.. దేశంలో ఒకవైపు మతోన్మాద విధానాలు,మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి,ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై తీవ్రమైన భారాలు వేస్తున్న బీజేపీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ తీవ్రమైన కరువుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు, మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పరిపాలించి ప్రజల నుండి దూరమైందని నేడు మళ్ళీ అధికారం నిలబెట్టుకోవడం కోసం మాయమాటలు చెబుతూ ముందుకు వస్తున్నారని వీరందరినీ ఓడించాలని, నిరంతరం ప్రజా సమస్యలపై రైతులు, కార్మికులు,వ్యవసాయ కూలీల సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై,పరిశ్రమల కాలుష్యంపై,మూసి జల కాలుష్యంపై,ధరల పెరుగుదలపై అనేక పోరాటాలు నడుపుతున్న సీపీఐ(ఎం) కు, సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ గారికి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలపై పోరాడే వారు ఎంపీగా గెలవడం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని, అందుకే ప్రజలంతా ఒకసారి ఆలోచించి ఈ పార్లమెంటు ఎన్నికల్లో సీపీఐ(ఎం) కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మండల కార్యదర్శి గంగాదేవి సైదులు కీసరి నర్సిరెడ్డి,చీరిక సంజీవరెడ్డి, బోయ యాదయ్య,భీమిడి ప్రభాకర్,సుక్క ముత్తమ్మ, బోయ నరసింహ,నందగిరి వసంత,బద్దం అంజయ్య, కందాల రవీందర్ రెడ్డి,చీరిక అలివేలు,బోయ బల్ నరసింహ,గుడ్డేటి నరసింహ,రొడ్డ యాదయ్య, కడగంచి రాజేష్,రత్నం శ్రీకాంత్,సిద్ధగోని శ్రీకాంత్, రోడ్డ భగత్ సింగ్,నక్క లింగస్వామి,నేరడి మహేష్, బర్రె రాజ్ పెరియర్,నక్క నాగరాజ్,బోయ పృథ్వీరాజ్, మీసాల లింగయ్య,బోయ మానస,సుక్క రమేష్, గుడ్డేటి సుజిత్,సుక్క శ్రీకాంత్,రత్నం చంద్రయ్య, బందర్ సురేష్,నేరడి లింగయ్య,ఆనంద్ బోయ, నాగేష్ బోయ,అరుణ రత్నం,పద్మ అంతటి,గుడ్డేటి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.