కండువా మార్చేద్దామా..!

– పార్టీ మారే యోచనలో ద్వితీయశ్రేణి నేతలు
– అధికార కాంగ్రెస్‌ వైపు మొగ్గు
– పార్టీని వీడిన వారు సొంత గూటికి..
– పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో డోర్లు తెరిచిన కాంగ్రెస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రతిపక్ష పార్టీల్లో.. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ కొనసాగుతున్న నేతలు, ప్రజాప్ర తినిధులు అధికార పార్టీలో చేరేందుకు సై అంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా కొనసాగు తున్న వారు మరోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలవాలన్న ఆరాటంతో కండువా మార్చుకునేందుకు రెడీ ఆవుతున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పలువురు కాంగ్రెస్‌ వైపు తొంగి చూస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదింటిలోనూ బీఆర్‌ఎస్‌ వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నాయకులు సొంత అవసరాల కోసం ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా.. అదే దారిలో మరికొందరు వెళ్లేందుకు ఉబలాట పడుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ డోర్లు తెరి చింది. దీంతో పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే హస్తం గూ టికి చేరగా, మరికొందరు సైతం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రె స్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన పాత వారంతా తిరిగి సొంత గూటికి చేరడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో గులాబీ పార్టీలో చాలా కాలంగా కొనసాగి పదవులు అనుభవించిన వారు సైతం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
కొనసాగుతున్న వలసలు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మేడ్చల్‌ నియోజ కవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మండల, డివిజన్‌ నాయకులు ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇక అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా వలసలు కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగి వివిధ కారణలతో గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిలో చాలా మంది తిరిగి కాంగ్రెస్‌ వైపు తొంగి చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌తోపాటు కీసర ఎంపీపీ సైతం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇటీవల బోడుప్పల్‌కు చెందిన దాదాపు 10 మంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరారు.
భరోసా దొరక్క..
పార్టీ మారేందుకు రెడీ అవుతున్న నేతలను నిలువరిం చి, భరోసా ఇచ్చేవారు లేని పరిస్థితుల్లో పార్టీ వీడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయా నియోజకవార్గల స్థాయిలో గులాబీ నేతలతో సమీక్ష సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని గుణపాఠంగా తీసుకుని పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ ముఖ్య నేతలు పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు ప్రజాప్రతి నిధులు, నేతలు పార్టీని వీడుతుండటం విస్మయం కలిగిస్తో ంది. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన వారు సొంత గూటికి వెళ్తుంటే, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారు కూడా పార్టీ వీడుతున్నారు. బోడుప్పల్‌, నిజాంపేట, జవహర్‌నగర్‌ కార్పొరేషన్లలో మేయర్‌తోపాటు కార్పొరేటర్లు, ఆయా మున్సి పాల్టీల్లో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో బలం పడిపోతోంది. బీఆర్‌ఎస్‌ కుమ్ములాటలు సమసి పోలేదనడానికి వలసలు కూడా కారణమని స్పష్టమవుతోంది. పార్లమెంటు ఎన్నికల ముందు మరి కొందరు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నేతలు కూడా ఎన్నికల సమయంలో ఎక్కువ మందిని చేర్చుకుని ప్రత్యర్ధులను డిఫె న్స్‌లో పడేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా గులాబీ నేతలు వలసలను నివారించడంపై దష్టి సారించి, పార్టీ కేడర్‌కు భరోసా ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కోరుతున్నారు.