జెరూసలెం : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తన విధినిర్వహణలో విఫలమైనందున సిరియాలో తన దౌత్య మిషన్‌పై దాడి చేసినందుకు ఇజ్రాయెల్‌ను శిక్షించాల్సిన బాధ్యత ఇరాన్‌పై ఉందని ఇరాన్ గురువారం ఐక్యరాజ్య సమితికి తెలిపింది. ఏప్రిల్ 1 వైమానిక దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కుడ్స్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జనరల్స్‌తో సహా ఏడుగురు ఇరాన్ అధికారులు మరణించారు. దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు.
”డమాస్కస్‌లోని మా దౌత్య ప్రాంగణంపై జియోనిస్ట్ రాజ్యం చేసిన దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించి, తదనంతరం నేరస్థులను న్యాయస్థానానికి తీసుకువచ్చినట్లయితే, ఈ మోసపూరిత పాలనను శిక్షించాల్సిన అవసరం ఇరాన్‌కు తప్పివుండేదే” అని ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఇరాన్ మిషన్ పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ చేసిన పనికి ”తప్పక శిక్షించబడాలి” అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. డ్రోన్ దాడుల నుంచి బాలిస్టిక్ క్షిపణి దాడుల వరకు ప్రతీకారం తీర్చుకోవచ్చనే ఊహాగానాలకు ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేస్తున్నాయి.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్ని సెలవులను రద్దు చేసి ఇజ్రాయెల్ ఒక వారం పాటు ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తోంది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ముగింపు, ఈద్-అల్-ఫితర్ పండుగ తర్వాత 24-48 గంటల్లో ఇరాన్ దాడి జరగబోతోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసిందని వివిధ వార్తా సంస్థలు రాశాయి. బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు వి90 కంటే ఎక్కువగా పెరిగాయి. ఒకవేళ ఇజ్రాయిల్ పైన క్షిపణి దాడి జరిగితే ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని బ్రిటీష్ మీడియా పేర్కొంది. అమెరికా ప్రభుత్వం టెహ్రాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కు మద్దతునిస్తుందని ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికన్ యుద్ధ విమానాలు చేరతాయా, లేదా అనే విషయం ఇంకా అధికారికంగా ధవీకరించబడలేదు.