
– నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్ యాదవ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీనవేని రాకేష్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బీనవేని రాకేష్ యాదవ్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన విధంగా బూత్ జోడో ద్వారా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని పిలుపునిచ్చారు, పార్లమెంట్ ఎన్నికల కోసం వెంటనే డోర్ టు డోర్ ప్రచారం మొదలు పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటిల గురించి విశృతంగా ప్రచారం చేయాలని తెలిపారు .బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పి కొట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రచారం వేగవంతం చేయాలని కోరారు. బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలు తిప్పి కొట్టి ప్రజలకు నిజానిజాలు తెలిసేలా కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాంతల శివారెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కో ఆర్డినేటర్ చిదురాల సురేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శులు బోయిని నరేష్, లావుడ్య జవహర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మ్యాదరబోయిన శ్రీకాంత్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శులు పోగుల కుమార్, బూరుగు సతీష్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నవేని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.