ఆద్యంతం వినోదభరితం

ఆద్యంతం వినోదభరితంగురు చరణ్‌, కష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ నిర్మాణంలో అవినాష్‌ కుమార్‌ తీసిన చిత్రం ‘కొంచెం హట్కే’. ఈ సినిమాకు కష్ణ రావూరి కథ అందించారు. ఈనెల 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చూసి చాలా నవ్వుకున్నాను. ఇంతలా నవ్వుకుని చాలా రోజులైంది. చిత్ర దర్శకుడు అవినాష్‌ విజన్‌ కనిపిస్తోంది. కష్ణ రైటింగ్‌ బాగుంది. కేఎం రాధాకష్ణ ఈ సినిమా వెనకాల ఉండటం అదష్టం’ అని తెలిపారు.
‘ట్రైలర్‌ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. కళాతపస్వీ విశ్వనాథ్‌ వల్లే కొత్త కథ, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలని అనుకున్నాను. అందుకే టైటిల్‌ కూడా కొత్తగా పెట్టాం. ఇందులో హీరో హీరోయిన్లుండరు. పాత్రలే ఉంటాయి. వేరే వేరే ప్రపంచాల్లోంచి వచ్చిన మనుషులంతా కలిసి సినిమా తీసే కాన్సెప్ట్‌తో ఈ మూవీ సాగుతుంది. ఎంతో వినోదాత్మకంగా ఉండేలా సినిమాను తీశాం’ అని దర్శకుడు అవినాష్‌ అన్నారు. రచయిత కష్ణ రావూరి మాట్లాడుతూ, ‘ ‘కష్టపడితే సక్సెస్‌ వచ్చిందని కొందరు, లక్‌ వల్లే సక్సెస్‌ వచ్చిందని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు. కానీ టైం వల్లే అంతా జరుగుతుంది. అన్నీ కలిసి వస్తేనే సక్సెస్‌ వస్తుంది. కష్టపడితేనే విజయం వరిస్తుంది. బయటి ప్రపంచాన్ని చూస్తే కొత్త పాత్రలు, కొత్త కథలు వస్తాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది’ అని చెప్పారు. గురు చరణ్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో మాధవ్‌ పాత్రను పోషించాను. నటుడిగా ఎదగాలనే ప్రయత్నాలు చేసే కారెక్టర్‌లో కనిపిస్తాను. సినిమాలో సినిమా తీయడం బాగుంటుంది. అందరినీ నవ్వించేలా ఈ మూవీ ఉంటుంది’ అని అన్నారు.