ఆస్తి పన్ను రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

– మున్సిపల్ కమిషనర్  మున్వర్ అలీ

నవతెలంగాణ-హలియా
ఆస్తి పన్నుపై ప్రభుత్వ ఇస్తున్న ఐదు శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాలియా మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. హాలియా మున్సిపాలిటీలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలన్నారు. గతంలో బకాయి ఉన్న వారికి ఇది వర్తించదని, బకాయిలతో పాటు ఈ ఏడాది పన్ను కూడా చెల్లించిన వారు రాయితీ పొందవచ్చని తెలిపారు.