బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కష్ణ హీరోగా వస్తున్న చిత్రం ‘సోలో బాయ్’. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. గౌతమ్ కష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత చౌదరి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో గౌతమ్‌కి తల్లి పాత్రలో చేస్తున్నాను. సెవెన్ హిల్స్ సతీష్ ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. డిఓపి త్రిలోక్ పనితీరు చాలా బాగుంది. ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఒక మంచి ఫీల్ ఉంది’ అని అన్నారు. ‘నాకు ఈ అవకాశాన్నిచ్చిన సెవెన్ హిల్స్ సతీష్‌కి రుణపడి ఉంటాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు మంచి సినిమానే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి సినిమా. ఈ సినిమాలో నటించిన పోసాని కష్ణ మురళి, అనిత చౌదరి, భద్రం, సూర్య చాలా బాగా నటించారు. మా హీరో గౌతమ్ కష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నింటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని డైరెక్టర్ పి.నవీన్ కుమార్ చెప్పారు. ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా మంచి సినిమా. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి, కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్‌కి, టెక్నీషియన్‌కి కతజ్ఞతలు. గౌతమ్ కష్ణ ఈ సినిమాతో నాకు సొంత తమ్ముడిలాగా సపోర్ట్ ఇచ్చాడు. గౌతమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా బాగా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. హీరో గౌతమ్ కష్ణ మాట్లాడుతూ, ‘సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌ని తీసుకొస్తున్నారు. నా ఫస్ట్ సినిమా నుంచి బిగ్ బాస్ జర్నీ అలాగే ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి, మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.