– బీఆర్‌ఎస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంబేద్కర్‌ను కాంగ్రెస్ సర్కార్ అవమానించిందనీ, అందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో వారు మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ సచివాలంయ సమీపంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు ఆ విగ్రహం వద్ద అలంకరణ చేయకుండా, పూలమాల వేయకుండా అంబేద్కర్‌ను అవమానించిందని తెలిపారు. కేసీఆర్ గుర్తులను చెరిపేయాలనే కక్షతో కాళేశ్వరం నీళ్లను రైతులకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు.