మజ్లిస్‌ ఆగడాలను అడ్డుకుందాం

మజ్లిస్‌ ఆగడాలను అడ్డుకుందాం– పాతబస్తీలో సమస్యలపై పోరాడేది బీజేపీయే
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి
హైదరాబాద్‌: పాతబస్తీలో మజ్లిస్‌ అగడాలకు వ్యతిరేకంగా పోరాడేది బీజేపీయేనని ఆపార్టీరాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ కాచిగూడ మాజీ కార్పొరేటర్‌ఎక్కాల చైతన్య కన్నా తన అనుచరులతో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగాబర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ పార్లమెంట్‌ లో బీజేపీ గెలువబోతుందన్న భయం పట్టుకున్న మజ్లిస్‌ పార్టీ అధినేత అసుద్దీన్‌ ఓవైసీ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారని అన్నారు. మజ్లిస్‌ పార్టీకి సిద్ధాంతాలు, నియమాలు అంటూ ఏవీ ఉండవని, అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు తెలుపుతూ తమ గుండాగిరిని, అవినీతి అక్రమాలను కొనసాగిస్తుందన్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి, బీజేపీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లాఅధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతంరావు, పిఎల్‌ శ్రీనివాస్‌, ఎక్కాల కన్నా,సి. నందకిషోర్‌ యాదవ్‌, ఎక్కాల నందు, ఎ. అజరు కుమార్‌, వనం రమేష్‌, రాజశేఖర్‌ రెడ్డి,ఎ.సూర్యప్రకాష్‌ సింగ్‌, ఆరవింద్‌, కృష్ణ కుమార్‌, శీర్సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.