– ఆర్.ఆర్.యదుకృష్ణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మనం జీవించడమే కాకుండా …ప్రతి ఒక్కరిని జీవించనిద్దామని బారతీయ యోగ సంస్థాన్ (బీవైఎస్) హైదరాబాద్ వెస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.యదుకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ నిర్వహించిన బీవైఎస్ 58వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసుధైక కుటుంబ భావనతో ప్రతి ఒక్కరి ఆనందం కోసం, సమానత్వం కోసం బీవైఎస్ పని చేస్తున్నదని తెలిపారు. దేశ, విదేశాల్లో 4 వేలకు పైగా బీవైఎస్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిర్వాహక అధికారి మధుకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం బీవైటస్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ ప్రభు ఛీప్ ప్యాట్రన్ బ్రిజ్ వాల్ జీ, బీవైఎస్ సాధకులు హర్నాథ్ రెడ్డి, పి.రాజేశ్వర్, శ్రీనివాస్, ప్రొఫెసర్ శ్రీధర్ రావుమోహన్ లాల్ జీ తదితరులు పాల్గొన్నారు.