బస్తీబాటలో మార్నింగ్ వాక్ చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – అచ్చంపేట 
మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ బస్తిబాట నిర్వహించారు. రెండవ వార్డు సాయినగర్ లో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ…వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలను మరమ్మత్తులు చేయించాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, స్థానిక కౌన్సిలర్లు , పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.