ఊరికి పోయేచ్చేసరికి ఇల్లుగుల్లా

– 20 తులాల బంగారం, కొంత నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
– గున్‌గల్‌లో ఘటన
– సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీి
నవతెలంగాణ-యాచారం
ఓ కుటుంబం ఊరికి పోయివచ్చేసరికి ఇల్లు గుల్లా అయ్యింది. ఈ సంఘటన యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గున్‌గల్‌లో మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాచారం మండల పరిధిలోని గున్‌గల్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ రఫీ తండ్రి జహంగీర్‌ 14వ తేదీ న కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా పీఏ పెళ్లికి 10:30 గంటల సమయంలో వెళ్లారు. మరుసటి రోజు 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణమై గున్‌గల్‌లోని ఇంటికి వచ్చారు. వచ్చి చూసేసరికి ఇల్లు తర్వాత తెరిచి ఉంది. వారు ఇంట్లోకి పోయి చూసేసరికి బీరువా తలు పులు తెరి చి ఉన్నాయి. కూతురు పెండ్లి కోసమని తెచ్చిపెట్టిన 20 కులాల బంగారం, కొంతమేర నగదు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధి తులు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ శంకర్‌ కుమార్‌ల ఆధ్వర్యంలో క్లూస్‌ టీమ్‌తో కలిసి దొంగ తనం జరిగిన తీరును పరిశీలించారు. దొంగతనం వివరాలను బాధిత కుటుంబాన్ని అడిగి పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.