పాటల చిత్రీకరణలో పోలీస్‌ వారి హెచ్చరిక

పాటల చిత్రీకరణలో పోలీస్‌ వారి హెచ్చరికనల్లపూసలు ఫేం బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్‌ క్రియేషన్స్‌ పతాకంపై బెల్లి జనార్థన్‌ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘పోలీస్‌ వారి హెచ్చరిక’. ఈ చిత్రం శరవేగంగా టాకీపార్ట్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, ‘ అరకులోయ, కాఫీ వనం, ఆపిల్‌ రిసార్ట్స్‌, వైజాగ్‌ యారాడా బీచ్‌, నకిరేకల్‌ లాండ్స్‌, యస్‌ స్టూడియో తదితర లొకేషన్స్‌లో పాటలను చిత్రీకరించాం. గత రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో, ఐదు లక్షల ప్రైవేట్‌ సాంగ్స్‌ను స్వరపరచి సంచలనం సష్టించిన సంగీత దర్శకుడు గజ్వేల్‌ వేణును ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నాం. మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అని దర్శకుడు బాబ్జీ తెలిపారు. ‘రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ వెంటనే నల్గొండలో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి అవుతుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని నిర్మాత బెల్లి జనార్థన్‌ అన్నారు. అఖిల్‌ సన్నీ, అజరు ఘోష్‌, రవి కాలే, షియాజీ షిండే, శుభలేఖ సుధాకర్‌, కాశీ విశ్వనాథ్‌, సంజరు నాయర్‌, జబర్దస్త్‌ వినోద్‌, జబర్దస్త్‌ పవన్‌, హిమజ, జయ వాహిని, శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి, రుచిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : నళినీ కాంత్‌, ఎడిటర్‌ : శివ శర్వాణి, నిర్మాణ నిర్వహణ : ఎన్‌. వై. సుబ్బరాయుడు.