నవతెలంగాణ – అచ్చంపేట
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారాలలో పరోక్షంగా అయినా కానీ ప్రత్యక్షంగా అయినా కానీ పాల్గొనట్లు ఆధారాలుంటే, వారిపై ఎన్నికల సంఘం వేటు వేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల అభ్యర్థులకు ప్రచారం చేయకూడదని నిబంధనలు 1949 సెప్టెంబర్ 17 నుంచి అమలు లోకి వచ్చింది. వారం రోజుల కింద సిద్దిపేట జిల్లాలో రాజకీయ అభ్యర్థి ప్రచార సభలో ఐకెపి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. కొందరు వీడియోలు ఫోటోలు తీసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఎన్నికల సంఘం 106 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర జారీ చేసింది. బల్మూరు మండల కేంద్రానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జతర సభలో పాల్గొన్నాడని, కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి మల్లు రవికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నాడని, కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అన్ని శాఖల అధికారులు ఎన్నికల సంఘం పరిధిలో పనిచేయవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు ఫలితం కావాల్సింది. రాజకీయ పార్టీలకు, ఎంపీ అభ్యర్థుల ప్రచారాలకు ప్రభుత్వ ఉద్యోగులు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనకూడదు అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. తన అధికారాన్ని ఉపయోగించి కిందిస్థాయి ఉద్యోగులను ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పకూడదు. ఫేస్ బుక్, వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా, అభ్యర్థులకు అనుకూలంగా పోస్టులు పెట్టిన ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండకపోతే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.