నవతెలంగాణ-శంకరపట్నం : శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలు బుధవారం శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు శ్రీ మురళీ కృష్ణమాచార్యులు ల ఆధ్వర్యంలో వేద మంత్రోత్సహల మధ్య స్వామి వారి కల్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కు పట్టు వస్త్రాలు వంగల నారాయణరెడ్డి,తలంబ్రాలను ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి- ఎల్లారెడ్డి, పుస్తె మట్టెలు సిరిపురం కొండయ్య,లు శ్రీ సీతారాముల వారికి సమర్పించారు. కళ్యాణ మహోత్సవానికి భద్రాచలం నుండి 600 లడ్డు ప్రసాదాలను మాజీ ఉపసర్పంచ్ అడితం కుమార్ ఆడితం మహేందర్ లు సమర్పించారు.గ్రామంలో పండగ వాతావరణం లో బ్యాండ్ మేళాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి లు మాట్లాడుతూ.తలంబ్రాలను భద్రాచలం నుండి తీసుకువచ్చామని గ్రామ ప్రజలందరికీ సీతారాముల ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖసంతోషాలతో జీవించాలన్నారు. ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు చిన్న పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను ఆలకించారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు తీర్థ ప్రసాదలను స్వికరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాటికొండ సదానందం కన్నాపూర్ భజన మండలి భక్తులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.