నవతెలంగాణ – తిరుమలగిరి
ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రం లోని మార్కెట్ యార్డ్ ఆవరణంలో, పాత గ్రామంలో, మండలంలోని వెలిశాల గ్రామంలోని శ్రీ రాముల వారి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఎన్నో కష్టాలు త్యాగాలు కోర్చిన శ్రీ సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, సత్య ధర్మ పాలనలు నేటి భావితరాలకు ఆదర్శప్రాయమని, శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులని వేడుకున్నానని తెలిపారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, మున్సిపల్ చైర్మన్ చాగంటి అనసూయ రాములు, రజనీకాంత్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జ్ కందుకూరి లక్ష్మయ్య, జిల్లా నాయకులు సుంకర జనార్ధన్, మూల అశోక్ రెడ్డి, నాయకులు పాలకుర్తి రాజయ్య, పేరాల వీరేష్, కౌన్సిలర్ ప్రియలత రామ గౌడ్, దాచేపల్లి వెంకన్న, ఎల్సోజు నవీన్, పత్తేపురం సుధాకర్, సామా ఆంజనేయులు, సురేష్, గాదరబోయిన లింగయ్య, వెలిశాల గ్రామం మాజీ సర్పంచ్ వీరయ్య తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.